how to apply caste certificate in online

తెలంగాణలోని అన్ని జిల్లాలలో లేదా మండలాలలో ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనం అతి సులభంగా కచ్చితంగా తక్కువ సమయంలో పొందగలిగే సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ లేదా కుల దృవీకరణ పత్రము.  ప్రతి వ్యక్తికి లేదా తెగకు లేదా ప్రతి వర్గానికి కులానికి సంబంధించినది.  దీనివలన సగటు వ్యక్తి ఏదైనా లబ్ధి పొందవచ్చు. ఇది ఉపయోగపడు సందర్భాలు విద్యారంగం ,వ్యవసాయరంగం ఉపకారవేతనాలకు మరియు స్కాలర్షిప్స్ లేదా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అత్యవసరం అన్ని రకాల వారికి లబ్ధి చేకూర్చే దిశగా పనిచేస్తుంది.  

రెడ్డి , వైశ్య లేదా రావు వంటి సంపన్న వర్గాల వారికి ఇది నిరుపయోగంగా పనిచేస్తుంది.( వర్తించదు).  (క్యాస్ట్ సర్టిఫికెట్) కుల దృవీకరణ పత్రం పొందాలంటే వారికి కనీస అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.  అవి ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఈజీగా పొందవచ్చు.


how to apply caste certificate online:


క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లై చేయాలంటే కావాల్సిన ధ్రువీకరణ పత్రములు:-

1)  చదువుకున్న అభ్యర్థి అయితే పదవ తరగతి మెమో  లేదా బోనఫైడ్ సర్టిఫికెట్ . 

2) అభ్యర్థి యొక్క తల్లి లేదా తండ్రి యొక్క  పాతది(ఓల్డ్ ) క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం ఎందుకంటే ఇది ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని  తెలియజేస్తుంది. 

 3) అభ్యర్థి  యొక్క ఆధార్ కార్డు . 

4)  వ్యక్తి  కుల సభ్యులు మరియు కుల పెద్దల తో ఒక లెటర్ రాయించి వారి సంతకాలు కూడా అవసరం.  మరియు స్టాంప్ వేసి లెటర్ని జోడించి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు జత చేయాల్సి ఉంటుంది. 

5)  అభ్యర్థి యొక్క  ఫోటో సంతకం కావాలి. 

 క్యాస్ట్ సర్టిఫికేట్ ని మీసేవలో లేదా ఏపీ ఆన్లైన్ లేదా టీఎస్  ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
పైన తెలిపిన సర్టిఫికెట్లు అన్ని మీ దగ్గర ఉంటే ఈ సర్టిఫికెట్ తో మీరు 15 నుంచి 35 రోజుల లోపు సులభంగా పొందవచ్చు.